జబర్దస్త్ షోలో పంచ్ ప్రసాద్ కామెడీ గురించి, పంచులు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోగ్య పరంగా ఎంతో బాధపడుతూ కూడా ఆడియన్స్ ని నవ్వించడమే అతని లక్ష్యం. అలాంటి పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించిపోయింది. ప్రసాద్ ఇప్పటికే కిడ్నీ ప్రాబ్లమ్ తో చాలా బాధపడుతున్నాడు. "మూడేళ్ళ క్రితమే రెండు కిడ్నీలు పాడైపోయాయి. డాక్టర్ ని అడిగితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించమని చెప్పారు. ఈ ట్రీట్మెంట్ కి సుమారు 15 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉంది. అలా ట్రీట్మెంట్ అయ్యాక ఒక సంవత్సరం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. మా తరపున మేము కొంత డబ్బు వేసుకున్నాము...వ్యూయర్స్ కి చేతులెత్తి అడుగుతున్నాను మీకు తోచినంత సాయం చేయండి.
అది ప్రసాద్ అన్నకు చాలా హెల్ప్ అవుతుంది. మీ దగ్గర ఎంతుంటే అంతే అన్నకు ఫోన్ పే చేయొచ్చు...అకౌంట్ నంబర్ కూడా పోస్ట్ చేశాను దానికి కూడా పంపొచ్చు. మీరు ఎంత డొనేట్ చేయగలిగితే అంత డొనేట్ చేస్తే ప్రసాద్ అన్నను మనం కాపాడుకోవచ్చు. మంచి కమెడియన్ ని బతికించుకున్నవాళ్ళం అవుతాం. వదిన అన్నను తీసుకుని అన్ని హాస్పిటల్స్ కి తిరుగుతూనే ఉంది. ఆమె బాధను ఆపడం ఎవరి తరం కావడం లేదు.. ప్రసాద్ అన్న రికవరీ అవ్వాలని అనుకుంటున్నారు కదా అది మీ చేతుల్లోనే ఉంది.. కొన్ని చోట్ల ఈ విషయం గురించి ఫ్రాడ్ కూడా జరుగుతోంది. అందుకే వదిన ఫోన్ నంబర్ మాత్రమే ఇస్తున్నాను...దానికి మీరు ఎంత పంపించాలని అనుకుంటున్నారో అంత పంపించి ప్రసాద్ అన్నకి మీరు సాయంగా నిలబడండి." అంటూ నూకరాజు, ఆసియా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కిడ్నీ సమస్య కారణంగా పంచ్ ప్రసాద్ ప్రస్తుతం డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఆ బాధతోనే జబర్దస్త్ కి వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ కూడా చేస్తున్నాడు. కానీ ఆయన పరిస్థితి ఏమంత మెరుగుపడలేదు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమించినట్లుగా తెలుస్తోంది. ఐతే నూకరాజు ప్రసాద్ ని వీడియోలో చూపించాడు. ఆక్సిజన్ మాస్క్ వేసుకుని కనిపించాడు. ఇప్పుడు నూకరాజు దగ్గరుండి ఫండ్ రైజింగ్ చేస్తున్నాడు. ఎవరైనా సరే ఒక హెల్ప్ చేయాలి అనుకుంటే మీ డొనేషన్స్ పంపించండి అని కోరుతున్నారు జబర్దస్త్ టీం.